Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ నటి నటాషాతో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం

  • హ్యాచ్‌లో ప్రయాణిస్తూ నిశ్చితార్థం
  • మే తేరా, తూ మేరీ జాన్, సారా హిందూస్థాన్ అంటూ పోస్ట్
  • కొత్త జంటకు శుభాకాంక్షల వెల్లువ
బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లాడిన క్రికెటర్ల జాబితాలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా చేరబోతున్నాడు. నటి నటాషా స్టాంకోవిచ్‌ను పాండ్యా త్వరలో పెళ్లాడబోతున్నాడు. సముద్రం మధ్యలో ఓ హ్యాచ్‌లో ప్రయాణిస్తూ ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఒకరి వేలికి మరొకరు ఉంగరం తొడిగారు. ఈ విషయాన్ని హార్దిక్ ఇన్‌స్టా గ్రామ్ ద్వారా స్వయంగా వెల్లడించాడు.

పాండ్యా షేర్ చేసిన ఫొటోలో నటాషా తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తోంది. ‘మై తేరా, తూ మేరీ జాన్, సారా హిందూస్థాన్’ అని ఆ పోస్టుకు పాండ్యా క్యాప్షన్ తగిలించాడు. ఇక కాబోయే కొత్త జంటకు టీమిండియా సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సారథి కోహ్లీ, కుల్దీప్ యాదవ్, ధోనీ భార్య సాక్షి, అజయ్ జడేజా, కృనాల్ పాండ్యా భార్య పంఖూరి శర్మ, సోఫీ చౌదరి, సోనాల్ చౌహాన్, శ్రేయాస్ అయ్యర్, మన్‌దీప్ సింగ్ లతో పాటు ముంబై ఇండియన్స్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది.
Bollywood
Natasha
Hardik pandya
Engagement

More Telugu News